Friday, March 23, 2012

ఉగాదంట


ఉగాదంట...

దేశమంత పండగంట
ఇంట్లో విందంట
ఒంట్లో సందడంట
పేదోడికి పస్తులంట
పెద్దోడికి బూర్లంట
న్యాయమేదంట?

దేవుడంటె భయమంట
డబ్బులంటె భక్తంట
మతాలంట కులాలంట
మత గురువులంట
కుల వీరులంట
అష్టదిక్కులా హాహాకారాలంట
లోకులంత చోరులంట

ధర్మానికి ఒకటే కాలంట
కలి యుగం అంట
కల్కి వస్తాడంట
సమయం ఆసన్నం అంట

హ.. హ... యుగ ఆది అంట!





2 comments:

Surendra said...

blogger dwara vyakthaparichavu nee ontlona dagunnaa manta :)

adarsh said...

ఇప్పుడప్పుడే రాడనుకుంట కల్కి :)